సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’ను విడిచిపెట్టనున్నారట. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మెగా, మాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది.