సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే సినిమా రూ100కోట్ల క్లబ్లో చేరిపోయింది. పాత చిరును తెరపై చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీనికో తోడు సెకండాఫ్లో రవితేజ సినిమాకు చాలా బలంగా మారాడని తెలుస్తోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విజయోత్సవ వేడుక జరుపుకుంది.