విశాఖలో వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వద్ద శరవేగంగా ఈవెంట్ స్టేజ్ పనులు జరుగుతున్నాయి. నిన్న రాత్రి ఆర్కే బీచ్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు తరలించారు. ఈరోజు సాయంత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రారంభంకానుంది. నిన్న వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌పై మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రీ- రిలీజ్ వేడుకకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు.