మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిరు యూఎస్‌లోని తన అభిమానులతో జూమ్ కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఫన్నీ విషయాలను పంచుకున్నారు.‘‘వాల్తేరు వీరయ్య’ యూఎస్ ప్రీమియర్స్ చూసి ఇక్కడి వెబ్సైట్లు 2.5 రేటింగ్స్ ఇచ్చాయి. చూసి నవ్వుకున్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది.. 2.5 అంటే 2.5 మిలియన్ డాలర్లు అని. యూఎస్‌లో అంత రెవెన్యూ వస్తుందని వారు ముందే చెప్పారు.’’ అంటూ ఫన్నీగా తెలిపారు.