తాను ట్విటర్ సీఈఓగా ఉండాలా? వద్దా? అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తూ ఎలన్ మస్క్ ట్విటర్‌లో పోల్ పెట్టారు. దీనికి ఎలాంటి ఫలితం వచ్చినా దానికే కట్టుబడి ఉంటానని తెలిపారు. మీరు ఏది అనుకుంటే అదే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా కోరుకోండి అంటూ ట్విటర్‌లో ట్వీట్స్ చేశారు. కాగా ఈ పోల్స్‌లో ఎలన్ మస్క్‌కు ప్రతికూలంగానే ఓట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు మస్క్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవాలని 56.3 శాతం మంది, తప్పుకోవద్దని 43.7 మంది కోరుకున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.