తమకు మార్వెల్ పాత్రల్లో నటించాలని ఉందని ‘ఆర్ఆర్ఆర్’ నటులు జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటునాటు) గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికాలో ఎన్టీఆర్, చెర్రీ సందడి చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియాతో వారు ముచ్చటించారు. ఏ మార్వెల్ క్యారెక్టర్ చేయాల నుకుంటున్నారని వారిని మీడియా ప్రశ్నించగా.. ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి పాత్రలు చేయాలనుందని పేర్కొన్నారు.