వ్యక్తిగత ఎజెండా లేదా రహస్య ఎజెండాతోనే రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని భారత రెజ్లింగ్ ఫెడరేషన్(WFI) వ్యాఖ్యానించింది. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుత మేనేజ్మెంట్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రెజ్లర్లతో ఎవరైనా ఇలా చేయిస్తుండొచ్చని అభిప్రాయపడింది. నిత్యం రెజ్లర్ల అభ్యున్నతి కోసమే ఫెడరేషన్ పాటు పడుతుందని స్పష్టం చేసింది. భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ పొగాట్, తదితరులు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి ప్రవర్తనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేశారు. దీంతో కేంద్రం వివరణ కోరగా ఫెడరేషన్ ఇలా స్పందించింది.