ఉక్రెయిన్పై తక్షణమే యుద్ధం ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను రష్యా లెక్కచేయట్లేదు. కీవ్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. రష్యా ఐసీజే ఆదేశాలకు కట్టుబడాల్సి ఉన్నప్పటికీ బేఖాతరు చేయడం గమనార్హం. దాదాపు 22 రోజుల నుంచి ఈ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో మెజార్టీ దేశాలు రష్యా దేశంపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి.