టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కొలిక్కిరాలేదని క్రెమ్లిన్ పేర్కొంది. తమ దేశం నాటోలో చేరకుండా తటస్థంగా ఉంటుందని ఉక్రెయిన్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ.. చర్చల్లో పురోగతి లభించనట్లు తెలుస్తుంది. ఈ అంశంపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. మరోవైపు చర్చలు సానూకూలంగా సాగాయంటూ రష్యా తరఫున సంధానకర్తగా హాజరైన వ్లాదిమిర్ మెడిన్‌స్కీ తెలిపారు.