• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వార్: భద్రతా మండలి నుంచి రష్యా తొలగింపు?

    ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడుతున్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న ఈ దేశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి తొలగించేందుకు బ్రిటన్ సిద్ధమవుతుందని ఆ దేశ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇటీవల రష్యా దాడిని ఖండిస్తూ UNOలో తీర్మానం ప్రవేశపెట్టగా అన్ని దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఓటింగ్ వేయగా.. రష్యా మాత్రం దాడిని సమర్థించుకుంది. దీంతో ఆ తీర్మానం వీగిపోయింది. UNOలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యాను ఎలాగైనా తప్పించాలని సభ్య దేశాలు చూస్తున్నట్లు సమాచారం.