ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి సందర్భంగా నేడు రష్యా విక్టరీ డేను నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. సైన్యంలో పౌరులను కూడ భాగస్వాములను చేసేందుకు అనుమతులు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. అసలు ఈరోజు పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.