వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమానుషం జరిగింది. చికిత్స కోసమని వచ్చిన వ్యక్తికి పుర్రె లేకుండా చేశారు. తర్వాత పేషంట్ బంధువులతో తీసుకెళ్లాలని చెప్పారు. ఆరోగ్య శ్రీలో ఆరు రోజులు మాత్రమే చికిత్స అందిస్తామని తర్వాత రోజుకు లక్ష రూపాయలు కట్టాలని బెదిరించారు. ఆసుపత్రి స్టాఫ్ తో కలిసి డిశ్చార్జి ఫామ్ కూడా నింపించేశారు. డాక్టర్లు చేసిన పని తెలియని పేషంట్ బంధువులు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. పేషంట్‌ని ఎంజీఎంకు తరలిచారు కానీ అతడి పుర్రె పై భాగం మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంది.