రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, కోలుకోవడానికి కనీసం 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. దీంతో దిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్ ఎవరా? అన్న చర్చ మొదలైంది. అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పృథ్వీషా, మనీష్ పాండే, మిచెల మార్ష్‌లకు కూడా కెప్టెన్సీ అనుభవం ఉంది. కానీ, వార్నర్ సారథ్యంపైనే దిల్లీ యాజమాన్యం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. 2016 సీజన్లో వార్నర్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ కప్పు కొట్టింది. దీంతో దిల్లీ కెప్టెన్‌గా దాదాపు వార్నర్ ఖరారైనట్లే కనిపిస్తోంది.