దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ని ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. కోచ్ రికీ పాంటింగ్, మేనేజ్‌మెంట్ దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ పేరును పరిశీలించినప్పటికీ అనుభవజ్ఞుడైన వార్నర్‌కే యాజమాన్యం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబరులో రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో పంత్ స్థానంలో కెప్టెన్‌గా వార్నర్ ఎంపిక కానున్నాడు. వార్నర్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ జట్టు టైటిల్ గెలిచింది. మార్చి 31నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.