ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ ఇటాలియా మోదీ తల్లి హీరా బెన్ పట్ల చేసిన వ్యాఖ్యలపై…కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గట్టిగా స్పందించారు. “కేజ్రీవాల్ ఆశీర్వాదంతో ఆప్ నేతలు 100 ఏళ్ల తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కేజ్రీవాల్ ఇంతకు దిగజారడంలో ఆశ్చర్యమేమీలేదు. ప్రధానికి జన్మనివ్వడమే ఆమె చేసిన తప్పా?” అని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఇటాలియా వీడియోను విడుదల చేసిన బీజేపీ…అతడికి గుజరాత్ ప్రజలే బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించింది.