ఆటలో గెలుపోటములు సహజమని.. శత్రుత్వం పనికిరాదని పీసీబీ చైర్మన్ నజాం సేథీ అన్నారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో నిలదొక్కుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్టు గొడవలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. తమకు గెలుపు, ఓటములు ద్వారా ఎంతో అనుభవం వచ్చిందని.. కానీ ఆఫ్ఘన్‌కు ఆ అనుభవం లేదని తెలిపారు. మమ్మల్ని చూసి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. కాగా ఆసియా కప్ సందర్భంగా పాక్ ప్లేయర్ ఆసిఫ్ అలీ, ఆఫ్ఘన్ పేసర్ ఫరీద్ మాలిక్‌పై బ్యాట్‌తో దాడి చేయబోయిన సంగతి తెలిసిందే.