తెలంగాణ, ఏపీకి కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 85, ఏపీకి 20 టీఎంసీల నీటిని మే 31 వరకు కేటాయించింది. ఈ నీటి పంపిణీకి సంబంధించి మార్చి 10న ఇరు రాష్ట్రాల అధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు నాగార్జున సాగర్ లెఫ్ట్, రైట్ కెనాల్ ద్వారా నీరు అందనున్నాయి. వీటిలో హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీల నీరు విడుదల చేయనున్నారు.