జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బీజేపీతో పొత్తు ఉందని పవన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారన్నారు. పొత్తులపై ఇద్దరం క్లారిటీతో ఉన్నామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నిన్న కొండగట్టులో వారాహి వాహనానికి పవన్ ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.