ఉక్రెయిన్పై రష్యా మూడు నెలలుగా దాడి చేస్తుంది. ఈ దాడిలో వేలాది మంది పౌరులు సైనికులు మృతి చెందారు. ఉక్రెయిన్లోని అన్ని ప్రధాన నగరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భవనాలన్నీ శిథిలమయ్యాయి. ఇప్పటికే ప్రధాన నగరాలను రష్యా కైవసం చేసుకుంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యా తమపై చేస్తున్న దాడిలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, రోజుకు 60 నుంచి 100 మంది సైనికులను కోల్పోతున్నామని పేర్కొన్నారు. రోజుకు 600 మంది సైనికులు గాయపడుతున్నారని, ఇప్పటి వరకు 33,000 మంది సైనికులు మృతి చెందారని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.