భారత బాడ్మింటన్ జట్టు థామస్ కప్లో ఎంతో అద్భుతంగా రాణించింది. దీంతో 43 ఏళ్ల తరువాత ఈ టోర్నీలో స్వర్ణం సాధించి సత్తా చాటింది. ఈ విజయంపై భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ స్పందించాడు. ఈ టోర్నీలో విజయంతో ఇప్పుడు భారత జట్టు టాప్లో ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు అద్భుతంగా ఆడాడని, సరైన వ్యూహంతో జట్టుగా ఆడినందుకు తమకు కప్ సొంతమైందని పేర్కొన్నాడు. తనలోని ఆట పూర్తిగా ఇంకా బయటికి రాలేదని, ఒలింపిక్స్లో తన అసలైన ఆట చూస్తారని శ్రీకాంత్ పేర్కొన్నారు.