ఐసీసీ జట్ల ర్యాంకింగ్స్‌లో వన్డే, టీ20ల్లో ప్రస్తుతం టీమిండియా టాప్ ప్లేసులో ఉంది. టెస్టుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, టెస్టుల్లోనూ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటే ఏకకాలంలో అన్ని ఫార్మాట్లలో టాప్‌లో ఉన్న ఏకైక జట్టుగా భారత్ అవతరించనుంది. అయితే, టెస్టుల్లో అగ్రస్థానం కోసం భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే. టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియాను భారత్ ఢీకొనబోతోంది. ఆస్ట్రేలియా 126 రేటింగ్‌తో టాప్‌లో ఉండగా, భారత్ 115 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. కంగారూలతో జరిగే 4 టెస్టుల్లో భారత్ 3-1 తేడాతో గెలిస్తే టాప్ ప్లేస్ సాధ్యమే.