• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు

    ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఆలోచింపజేస్తుంది. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు నల్లపల్లి విజయభాస్కర్‌.. మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటును అమ్ముకొని..ఆత్మగౌరవాన్ని, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టలేమన్నారు. ఈ విషయాన్ని గట్టిగా తెలియజెప్పేందుకు ఫ్లెక్సీ కట్టినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ సరైన అభ్యర్థికి ఓటు వేయాలని.. డబ్బులకు ఓటు అమ్ముకోవద్దని విజయభాస్కర్‌ చెప్పారు.