ప్యాకేజీ రూ.10 లక్షలకు పెంచాం: సీఎం జగన్

© ANI Photo

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సభలో పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గతంలో రూ.6.80 లక్షలు ఇచ్చారు. దానిని మేము రూ.10 లక్షలకు పెంచి జీవో ఇచ్చాం. ముంపు బాధితులకు పునరావసం కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.19 వేల కోట్లతో 14 వేలమందికి పునరావాసం చేపడుతున్నాం. టీడీపీకి పోలవరంపై చిత్తశుద్ధిలేకే ఆరోపణలు చేస్తోంది’ అని విమర్శించారు.

Exit mobile version