ఆర్థిక మాంద్యం భయాలతో దిగ్గజ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్న వేళ జొమాటో కీలక ప్రకటన చేసింది. తాము ఉద్యోగుల్ని నియమించుకుంటామని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ లింక్డ్ ఇన్లో పోస్ట్ పెట్టారు. వివిధ విభాగాల్లో 800 మందిని తీసుకోనున్నారు. ” చీఫ్ ఆఫ్ స్టాఫ్ టూ సీఈఓ, జనరలిస్ట్, గ్రోత్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ వంటి ఐదు విభాగాల్లో 800 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న వారిని ట్యాగ్ చేయండి” అన్నారు. అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.