తెలంగాణలోని హైదరాబాద్ లో మొదలైన వీ హబ్ మరో 8 జిల్లాలకు విస్తరింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దీని నిర్వహణ గచ్చిబౌలి టీ హబ్ లోని అంబేడ్కర్ క్యాంపస్లో కొనసాగుతుంది. సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. అంతేకాదు ఇక్కడ ఎంపికైన మహిళలకు ఆయా రంగాల్లో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. పలు జిల్లాల నుంచి మహిళలు హైదరాబాద్ వచ్చి ఉండేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో వీ హబ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.