ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చివరి వికెట్ పడాల్సిన వేళ రాహుల్ క్యాచ్ మిస్ చేశాడు. దీని వల్లేే మ్యాచ్ ఓడిపోయామని అనేక ట్రోల్స్ వచ్చాయి. అయితే కేవలం రాహుల్ క్యాచ్ పట్టకపోవడం వల్ల మ్యాచ్ ఓడిపోలేదని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. టీమిండియా బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని ఆయన అన్నారు. ఇండియా ఇంకో 70-80 పరుగులు చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.