జట్టులో జస్ప్రిత్ బుమ్రా లేకపోవడంపై పేస్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించాడు. “ నాణ్యమైన ఆటగాళ్లు గైర్హాజరు కావటం ఎప్పుడూ బాధాకరమే. ఒక ఆటగాడు గాయపడినంత మాత్రాన ఆట అనేది ఎప్పుడు ఆగదు. బుమ్రా వంటి గొప్ప బౌలర్‌ను మిస్ అయ్యాం. తప్పకుండా త్వరలోనే అతడు తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. దాని కోసం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. భారత జట్టుతో కలిసేందుకు వేచి చూస్తున్నాడు” అని షమీ వెల్లడించారు.