తమ కూతుళ్ల కోసం తమ ఆస్తులన్నింటినీ అమ్ముకున్నామని సీనియర్ నటి జీవితా రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. జీవితా చిన్న కుమార్తె శివాత్మిక నటించిన ‘పంచతంత్ర’ సినిమా డిసెంబర్ 9న విడుదలైంది. ఈ సందర్భంగా జీవితా మీడియాతో మాట్లాడింది. ‘‘శివానీ, శివాత్మిక సినిమాల్లో యాక్ట్ చేస్తాం అని అడిగారు. అప్పుడు కంగారు పడ్డాం. దీనికి ఓకే అన్నామని, సినిమాల్లోకి రావడం అంత ఈజీ కాదని చెప్పాం. సినిమాల్లో సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. దీనికి మీరు బాధపడకూడదు.’’ అని చెప్పినట్లు జీవితా పేర్కొన్నారు.