తమ బొగ్గు తమకే కావాలంటూ సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలకు తెర లేపుతున్నారని సింగరేణి జేఏసీ చైర్మన్ ఆరోపించారు. 10 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాల్లోని బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని విజ్ణప్తి చేశారు. ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేస్తూ ప్రధాని మోదీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణిపై చేస్తున్న కుట్రలు ఆపివేయాలని కోరారు.
‘మా బొగ్గు మాకే కావాలి’

© ANI Photo ANI DIGITAL