ఇండియాతో తాము శాంతి కాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అల్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.“ భారత ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు సిద్ధం. పాక్కు శాంతి కావాలి. కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను ఆపాలి. కశ్మీర్ అంశం నిత్యం రగిలేది. అలాంటి వాటిపై కూర్చొని చర్చించుకోవాలి. ఇండియాతో మూడు యుద్ధాల చేశాం. కానీ, మిగిలింది పేదరికం. గుణపాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు శాంతి కోరుకుంటున్నాం” అన్నారు.