జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ తమ పార్టీ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము పిరమిత సంఖ్యలో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. 25-40 అసెంబ్లీ స్థానాలు, 7-14 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. భాజపాతో తమకు పొత్తు ఉండబోదని కానీ తమ మద్దతు మాత్రం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా పొత్తులకు వస్తే సంతోషిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ తన వారాహి వాహనానికి కొండగట్టులో పూజ చేసిన అనంతరం పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.