TS: తెలంగాణలోని సింగరేణి బొగ్గు పరిశ్రమను కేంద్రం ప్రైవేటుపరం చేయనుందన్న ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్దే 51శాతం వాటా ఉందని ఆయన గుర్తు చేశారు. ‘సింగరేణిని ప్రైవేటు పరం చేస్తామని ఎవరన్నారు? కావాలనే కొందరు ఇలాంటి రూమర్లు వ్యాప్తిచేస్తున్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయబోమని హామీ ఇస్తున్నాం’ అని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘సింగరేణిని ప్రైవేటుపరం చేయబోం’

Courtesy Facebook: KishanReddy Gangapuram