ఉగ్రవాదుల నుంచి జమ్మూను రక్షించడానికి భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూలో పర్యటిస్తున్న ఆయన.. రాజౌరిలో ముష్కరుల దాడిలో చనిపోయిన పోలీసులు కుటుంబాలను ఫోన్ ద్వారా పరామర్శించారు. “ ఏడుగురు సైనికులు కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి కలుద్దాం అనుకున్నాను. కానీ, వాతావరణ పరిస్థితుల వల్ల వెళ్లలేదు. వీర జవాన్ల ధైర్య సాహసాలు దేశానికేే ఆదర్శం. ఉగ్రవాదుల నుంచి జమ్మూని కాపాడి తీరతాం” అన్నారు.