గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్‌లో పార్టీ పునర్వ్యస్థీకరణ చేపడతామని వెల్లడించారు. మరింతగా కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. దేశ ఆదర్శాలు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో నిర్ణయాత్మక విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలను వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని మరోసారి వెల్లడించారు.