శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీలకు అసలైన సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు. “ మోదీని దేవుడు అంటున్న వాళ్లు…ఆయన ఎవరికి దేవుడో చెప్పాలి. దేవుడని అనే వ్యక్తికా లేదా గుజరాత్ వాళ్లకా. రూ. 400 ఉన్న సిలిండర్ వెయ్యి దాటినందుకా? రూ. 70 పెట్రోల్ రూ. 110 చేసినందుకా? 700 మంది రైతుల మరణాలకు కారణమైనందుకా? మోదీ ఎందుకు దేవుడో చెప్పాలి” అంటూ భాజపా నేతల్ని నిలదీశారు.