ఏపీ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు చెప్పింది. దక్షిణ అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని వెల్లడించింది.