సరసమైన ధరల్లో సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ సేఫ్టీతో 10 బడ్జెట్ కార్లు
రోడ్డు భద్రత నియమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. కార్లలో కచ్చితంగా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనే నిబంధన అమలు చేయనుంది.
ఇలాంటి తరుణంలో 6 ఎయిర్‌బ్యాగ్స్ కలిగి ఉండటంతో పాటు అందిరికీ అందుబాటులో ఉండే ధరల్లో లభించే కార్ల గురించి తెలుసుకోండి.
బలెనో - 8.5 లక్షల నుంచి..
మారుతి కంపెనీ ఈ కారులో చాలా భద్రతా సదుపాయాలను జోడించింది. బలెనో హ్యాచ్‌బాక్ జెటా, ఆల్ఫా ఎడిషన్స్‌లో ఆరు ఎయిర్‌బాగ్య్ ఇచ్చారు
( డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్, రెండు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్, ప్యాసింజర్ పక్కకి కూడా ఉంటాయి )
గ్లాంజా - 8.5 లక్షలు
టొయోటో గ్లాంజా టాప్ మోడల్ V AMT, బలెనోతో పోటీ పడుతుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్ కలిగి ఉండే కార్లలో గ్లాంజా, బలెనో తక్కువ ధరకు లభిస్తాయి.
కియా కేరెన్స్ - 9 లక్షలు
సౌత్ కొరియా సంస్థ కియా ప్రయాణికుల భద్రతా దృష్ట్యా చాలా సేఫ్టీ ఫీచర్స్‌ను తెచ్చింది. ఆరుగురు కూర్చొని ప్రయాణించేలా తీసకువచ్చిన MUV,
ది కేరెన్స్ 6 ఎయిర్‌బ్యాగ్స్ కలిగి ఉంటుంది.
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ - 9.3 లక్షలు
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ S MT 1.5 TDCiలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. NCAP 4 స్టార్ రేటింగ్ ఉంది. ఇందులో కారు ప్రమాదానికి గురయ్యే కంటే ముందు ఆటోమేటిక్‌గా బ్రేక్ పడుతుంది. క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్ కూడా ఇచ్చేలా బ్లైండ్ స్పాట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
హుందాయ్ i20, ఆస్తా - 9. 41, N లైన్ - 12 లక్షలు
హుందాయ్ i20లోని ఆస్తా, ఎన్ లైన్ కార్లలోనూ
6 ఎయిర్‌బ్యాగ్ సౌకర్యం కలిగి ఉన్నాయి. ఈ రెండు వాహనాలకు NCAP 3 స్టార్ రేటింగ్ ఉంది.
వెన్యూ - 11 లక్షలు
హుందాయ్ SUVలో వెన్యూకి అత్యంత పాపులారిటీ వచ్చింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ లాక్, చైల్డ్ సీట్స్‌కు యాంకర్ పాయింట్లు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, యాంటీ థెఫ్ట్ ఇంజిన్ మెుబిలైజర్ సౌకర్యాలు కల్పించారు.
మహీంద్రా XUV 300 - 11 లక్షలు
మహీంద్రాలో XUV 300 అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తుంది. భద్రతా నియమాల్లో
ఈ దేశీయ సంస్థ ముందుంటుంది. ఇందులోని
మినీ- SUV, XUV 300 కార్లు 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.
కియా సోనెట్ - 12 లక్షలు
SUV సెగ్మెంట్‌లోనే ఎక్కువగా అమ్ముడైన కార్లలో ఇది ఒకటి. అత్యాధునిక భద్రత సదుపాయాలతో దీనిని తయారు చేశారు. NCAP 3 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇందులోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉంది.
హోండా సిటీ - 12 లక్షలు
హోండా సిటీ కారు ఎన్నో ఏళ్లుగా అత్యంత పేరుపొందిన కార్లలో ఒకటిగా నిలుస్తూనే ఉంది. ఇందులోని VX , ZX మోడల్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.
హుందాయ్ క్రెటా - 13 లక్షలు
SUVల తర్వాత భారత్‌లో ఎక్కువగా కొనే కార్లలో హుందాయ్ క్రెటా పేరు ఉంటుంది. ఏషియన్ NCAP రేటింగ్ 5 ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ టాప్ టైర్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.