2022లో విమర్శకుల ప్రశంసలు పొందిన 12 సినిమాలు

YouSay Short News App

2022 సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేసింది. భాషతో సంబంధం లేకుండా.. ప్రాంతీయ సినిమాలు దేశవ్యాప్తంగా విజయం సాధించాయి. మరికొన్ని ప్రపంచ దృష్టినీ ఆకర్షించాయి.

మరి, విమర్శకు ప్రశంసలు అందుకుంటూ, ప్రేక్షకుడిని ఆలోచింపజేసిన సినిమాలేంటో తెలుసుకుందామా..!

ఈ ఏడాది ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాకుండా కనుమరుగైన చిత్రం ‘గార్గి’. సాయిపల్లవి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా విమర్శకులతో చప్పట్లు కొట్టించింది. బీడువారిన మనసులున్న మనుషులతో మకిలి పట్టిన ఈ ప్రపంచాన్ని ఎవరో ఒకరు శుద్ధి చేసి మళ్లీ సస్యశ్యామలంగా మార్చగలరని చాటిచెప్పిన సినిమా ఇది.

గార్గి - SonyLiv

నిత్యజీవిత సమాజంలో ఓ యువతి ఎదుర్కొనే అనుభవాలను ప్రతిబింబింపజేస్తుందీ సినిమా.  ఓ బాలిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తండ్రికి కుమార్తెగా ఇందులో సాయిపల్లవి నటించింది. ఈ సినిమా క్లైమాక్స్ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది.

స్వలింగ సంపర్కం, స్వజాతి వివాహాల గురించి ప్రస్తావించిన సినిమానే ‘బదాయ్ దో’. ఇంత సున్నితమైన అంశాన్ని తెరకెక్కించి దర్శకుడు హర్షవర్ధన్ కులకర్ణి సాహసం చేశారు. రాజ్ కుమార్ రావ్, భూమీ పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

బదాయ్ దో - Netflix

హిందీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసింది. స్వజాతి వివాహాల వల్ల కలిగే అనుకూలతలు, ప్రతికూలతలు, సమాజంలో వీరు పొందే గౌరవ మర్యాదలు వంటి అంశాలను ఇందులో చూపించారు.

టైం ట్రావెల్ కథా నేపథ్యంలో వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. తల్లీ, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని జోడించడంతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఒకే ఒక జీవితం - SonyLiv

ఓ సైంటిస్టు సాయంతో టైం మిషన్‌లోకి వెళ్లిన ముగ్గురు స్నేహితులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనే అంశాన్ని డైరెక్టర్ శ్రీ కార్తీక్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా కమర్శియల్‌గానూ విజయం సాధించింది.

ఈ మధ్య కాలంలో విడుదలైన కల్ట్ క్లాసిక్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్మీ జవాన్, సాధారణ అమ్మాయిగా నటించే యువరాణికి మధ్య జరిగే ప్రేమ ఎంతో అందంగా చూపించారు.

సీతారామం - Prime Video

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తీసినప్పటికీ లవ్‌స్టోరీ ట్రాక్ తప్పకుండా తీశారు డైరెక్టర్ హను రాఘవపూడి.  ఈ సినిమా సుమారు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది.

నటి సంగీత రీఎంట్రీ ఇచ్చిన సినిమా మసూద. కావ్య, తిరువూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అంచనాలు లేకుండా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టిందీ సినిమా.

మసూద - Aha (from Dec21)

దుష్టశక్తుల నుంచి ఓ ఒంటరి మహిళ తన కుమార్తెను ఎలా కాపాడుకుందనే కథా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. 2022లో విడుదలైన హార్రర్ చిత్రాల్లో కెల్లా ‘మసూద’ ప్రేక్షకుల మెప్పును పొందింది.

మొదటి భాగంలో కన్నా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. ట్విస్టులతో ప్రేక్షకుడిని మెప్పించిన సినిమా ‘దృశ్యం2’. హిందీలో అజయ్ దేవగణ్ నటించి హిట్ కొట్టాడు.

దృశ్యం 2(హిందీ)

అభిషేక్ పాఠక్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు చప్పట్లతో మెచ్చుకున్నారు. విమర్శకుల ప్రశంసలను సైతం ఈ సినిమా పొందింది.

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో మరో అద్భుతమైన సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సైకలాజికల్‌ డ్రామా విడుదలైన నుంచి విడుదలైన నుంచి అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఖాలా - నెట్‌ఫ్లిక్స్

ఖాలా మంజుశ్రీ అనే సింగర్‌గా తనపై తనకు అపనమ్మకం, గెలవాలన్న ఒత్తిడి, తనతల్లి నిరాదరణ ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొనే యువతిగా తృప్తి దిర్మి అద్భుతంగా పెర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. అన్వితా దత్‌ గుప్తన్‌ దర్శకత్వం వహించిన ఈ కళాఖండాన్ని మిస్‌ కావొద్దు.

నిజ జీవత కథ ఆధారంగా తీసిన ఓ స్ఫూర్తిదాయక, క్రీడా, సందేశాత్మక చిత్రం. మురికివాడ పిల్లలను డ్రగ్స్‌, క్రైమ్‌ వంటి పెడదారి పట్టకుండా ఓ రిటైర్డ్‌ టీచర్‌ వారితో ఓ ఫుట్‌బాల్‌ టీం తయారు చేస్తాడు. వారిని నేషనల్‌ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు పాటుపడుతుంటాడు.

ఝండ్‌-జీ5

సాధారణ జీవితం గడపలేని ఎంతో మంది జీవితాన్ని ఈ సినిమా కళ్లకు కడుతుంది. వారి దుర్భర జీవితాలు మిమ్మల్ని కదిలిస్తాయి.

ఓ లెక్చరర్‌ హత్య తర్వాత కళాశాలలో చెలరేగే అల్లర్లను సినిమా చూపెడుతుంది. లెక్చరర్‌ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు వచ్చిన పోలీస్‌ అధికారి అనుమానితులను చంపేస్తాడు.

జన గణ మణ- ప్రైమ్‌ వీడియో

కానీ ఈ కోర్టు ఎదుటకు కేసు వెళ్లినపుడు  ఓ సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. భారత న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపిన సినిమా ఇది. పృథ్విరాజ్‌ సుకుమారన్‌, సూరజ్‌ వెంజరమూడు అద్భుత నటన మమ్మల్లి కళ్లు పక్కకు తిప్పనివ్వదు.

ఓ కాలేజీ కుర్రాడి నుంచి ఓ బిడ్డకు తండ్రయ్యేవరకూ జీవన ప్రయాణమే హృదయం. వివిధ దశల్లో మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఎదుగుతాం, తొలి ప్రేమ, మలి ప్రేమ, స్నేహం, బ్రేకప్‌, బాధ్యతలు ఎలా మన జీవితంలో భాగమవుతాయో చక్కగా చూపించే సినిమా.

హృదయం- హాట్‌స్టార్‌

ప్రేక్షకులతో పాటు విమర్శకులకు కూడా నచ్చిన సినిమా ఇది. మన జీవితాన్ని రెండు భాగాలుగా చూసినట్లు అనిపిస్తుంది.

"హాస్యం, భావోద్వేగం, మహిళా హక్కులు, విద్య, పెళ్లి ఇలాంటి భావనల సమాహారమే ‘జయ జయ జయ జయహే’ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో మంచి హిట్‌గా నిలిచింది.

జయ జయ జయ జయహే

రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చార్లీ 777’ పెంపుడు జంతువులపై కొందరు చూపే క్రూరత్వం కారణంగా వాటి జీవితాలు ఎంత దుర్భలంగా మారుతాయో కళ్లకు కట్టినట్లు చూపించారు.

777 చార్లీ - Voot

మనిషికి, పెంపుడు జంతువుకి మధ్య ఉండే అనురాగం, భావోద్వేగం మనసుకు హత్తుకుంటుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.