ఓటమికి 10 ప్రధాన కారణాలు.. ఇవేనా..?

ఇండియా జట్టు

YouSay Short News App

కీలక సెమీస్ పోరులో టీమిండియా చేతులెత్తేసింది. ఇంగ్లాండుకు తలవంచి గెలుపును ఇచ్చేసింది. అయితే, ఓటమికి కారణాలున్నాయి. వీటిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టీమిండియా బౌలింగ్ చూస్తుంటే అసలు ఆడుతుంది సెమీఫైనలా, ప్రాక్టీస్ మ్యాచా? అన్న సందేహం కలిగింది. మొదటి బంతి నుంచే ఈ ధోరణి కనిపించింది. ఏ కోశాన కూడా సీరియస్‌గా తీసుకోలేదు. కనీసం పోరాట పటిమనైనా ప్రదర్శించలేదు. గెలవాలన్న తపన,కసి  లోపించాయి.

తపన లేక..

మరోసారి టీమిండియా పవర్ ప్లేలో విఫలమైంది. సెమీ ఫైనల్ మ్యాచ్ కావడం, పిచ్ బ్యాటింగుకి సహకరిస్తుండటంతో పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాల్సింది. పవర్ ప్లే ముగిసే సరికి ఓ 50 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ గమనం మరోలా ఉండేది. ఇక్కడా ఓపెనర్లు ఫెయిల్ అయ్యారు.

పవర్ ప్లే..

ఓపెనర్లు రాహుల్- రోహిత్ జోడీ విఫలమౌతున్నందున వేరే జోడిని ప్రయోగిస్తే బాగుండేది. రోహిత్- కోహ్లీ; రోహిత్- పంత్ కాంబినేషన్లను ఉపయోగిస్తే ఆట భిన్నంగా ఉండేదేమో. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ని ఓపెనర్‌గా ట్రై చేయాల్సింది.

సరైన వ్యూహం లేక..

కేవలం బ్యాటింగ్‌తో  ఇంకెన్నాళ్లు గెలవగలమో టీమిండియా ఆలోచించాలి. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. బుమ్రా లాంటి మేటి బౌలర్ అందుబాటులో లేనప్పుడు పేస్ పదును చూపగల సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను పరీక్షిస్తే బాగుండేది.

పేస్ పదును లేమి..

తుది జట్టు కూర్పు సరిగా లేదు. ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడంపై ఆలోచించాల్సింది. పైగా టీమిండియా బౌలర్లను ఐపీఎల్‌లో ఎదుర్కుంటుండటం ప్రత్యర్థులకు కలిసొస్తోంది. రైట్ హ్యాండర్లు ఎక్కువగా ఉన్న ఇంగ్లండ్ జట్టులో అశ్విన్‌కు బదులు లెగ్ స్పిన్నర్ చాహల్‌ని తీసుకోవాల్సింది.

జట్టు కూర్పు

జట్టులో యువకులకు చోటు కరువైంది. పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ అహ్మద్, సంజు శ్యాంసన్ లాంటి కుర్రాళ్లు టీమిండియా తలుపు తడుతూనే ఉన్నారు. సీనియర్లైన అశ్విన్, భువి, షమి, రాహుల్ పొట్టి ఫార్మాట్‌కు పనికి రారు. ప్రస్తుతం కెరీర్ చరమాంకంలో వీరున్నారు.

యంగ్ ప్లేయర్స్ కొరత

గత చరిత్ర ఎలా ఉన్నప్పటికీ టాస్ ఈ మ్యాచులో కీలకం అయింది. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే బ్యాటర్ల ఆలోచనా విధానం వేరేలా ఉండేది. ఒకట్రెండు వికెట్లు త్వరగా పడితే ఛేదనలో ఒత్తిడి పెరగొచ్చు. కానీ, లోతైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం వల్ల ఛేజింగ్ కాస్త కలిసొచ్చేదేమో.

టాస్

ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆడిన తీరు చిరస్మరణీయం. ఎక్కడా తడబడలేదు. ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. విజయం కోసం రిస్క్ తీసుకోలేదు. పిచ్ స్వభావాన్ని అదనుగా చేసుకుని పని పూర్తి చేశారు. ఈ విషయంలో వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే.

ఇంగ్లాండ్ ప్రదర్శన..

యువ ఆటగాళ్లను కాదని సీనియర్లను తీసుకున్నా, కీలక మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేకపోయారు. ఇంగ్లండ్‌ బ్యాటర్ల ఎదురుదాడికి చేతులెత్తేశారు. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు.

ఒత్తిడి

హార్ధిక్ పాండ్యాను మినహాయిస్తే మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పోరాడలేదు. అడపాదడపా పరుగులు చేసినా గొప్ప స్ట్రైక్ రేట్ లేకపోవడం పెద్ద మైనస్. కోహ్లీ(125), రాహుల్(100), రోహిత్(96) స్ట్రైక్ రేట్‌తో ఆడారంటేనే అర్థం చేసుకోవచ్చు. బట్లర్ స్ట్రైక్ రేట్ 163 కాగా, హేల్స్‌ది 182 కావడం గమనార్హం.

బ్యాట్స్‌మన్ స్ట్రైక్ రేట్