సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు చూసి హత్యలు, నేరాలు

YouSay Short News App

సినిమాలు చూసి అందులో హత్యలు, నేరాలు ఎలా చేశారు? ఎలా తప్పించుకున్నారో నిజ జీవితంలో అమలు చేస్తున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య నుంచి నిన్న దిల్లీ శ్రద్ధ హత్య వరకు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల స్ఫూర్తితో జరిగిన కొన్ని క్రైమ్స్‌ చూద్దాం.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ శ్రద్ధ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలా ‘డెక్స్‌టర్‌’ వెబ్‌సిరీస్‌ను స్పూర్తిగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటివే ఈ మధ్య 3 హత్యలు జరిగాయి.

డెక్స్‌టర్‌

ఉత్తరప్రదేశ్‌ అజాంగఢ్‌లో నవంబర్‌ 15న ఛేదించిన ఓ హత్య కేసులో ప్రిన్స్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆరాధన అనే మహిళను ముక్కలుగా కోసి బావిలో పారేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రిన్స్‌కు ఏడుగురు సాయం చేశారు.

ప్రిన్స్‌ యాదవ్‌, ఆరాధన గతంలో ప్రేమించుకున్నారు. ప్రిన్స్‌ విదేశాల్లో ఉండగా ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ప్రియుడ హత్యకు కుట్ర పన్నాడు. నవంబర్‌ 9న ఆమెను బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు.

పశ్చిమ బంగాల్‌ 55 ఏళ్ల వ్యక్తిని కుమారుడు, భార్య కలిసి హత్య చేశారు. ఈ కేసులోనూ అతడి శరీరాన్ని ముక్కలుగా చేసి..అతడి కుమారుడు బైక్‌పై యాత్రలకు వెళ్తూ వేర్వేరు చోట్ల పారేశాడు.

ఏపీలో సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను తాను సినిమా స్పూర్తితోనే హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. కృష్ణం రాజు నటించి, 1988లో వచ్చిన ‘అంతిమ తీర్పు’ తనకు స్పూర్తినిచ్చిందని చెప్పాడు.

అంతిమ తీర్పు

‘పుష్ప’ సినిమా చూసి దిల్లీలో కొంతమంది కుర్రాళ్లు ఓ అమాయకుడిని చంపేశారు. ఇదే సినిమా స్ఫూర్తితోనే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేయాలని ప్రయత్నించాడు.

పుష్ప

రియల్ లైఫ్‌లో రాఖీభాయ్‌లా ఎదగాలనుకున్న శివ ప్రసాద్‌ అనే 19 ఏళ్ల కుర్రాడు ఏకంగా 5 హత్యలు చేశాడు. అందులో నలుగురు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. KGF2 సినిమా తనకు స్పూర్తినిచ్చిందని ఆ కుర్రాడు చెప్పాడు.

KGF

మలయాళ సినిమా ‘దృశ్యం’ తెలుగు,తమిళ, హిందీ భాషల్లోనూ సూపర్‌హిట్‌ అయింది. భోపాల్‌లో ఇంద్రపాల్‌ సింగ్‌ అనే వ్యక్తి తన మేనకోడలిని చంపి మృతదేహాన్ని నదిలో పారేశాడు. ‘దృశ్యం’ సినిమా చూసే అలా చేశానని పోలీసులకు చెప్పాడు.

దృశ్యం

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్‌ సిరీస్‌ ‘మనీ హెయిస్ట్‌’. ఈ సరీస్‌ స్పూర్తితో లఖ్‌నవూలోని గోవాతి నగర్‌లో ఓ యువకుడు తన గ్యాంగ్‌తో కలిసి ఓ జువెలరీ షాప్‌ను దోచుకెళ్లాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

‘మనీ హెయిస్ట్‌’

అక్షయ్‌ కుమార్ హీరోగా వచ్చిన ఈ బాలివుడ్ సినిమాలో అధికారులుగా రెయిడ్‌కు వెళ్లి కోట్లు కొళ్లగొడతారు. హైదరాబాద్‌లో ఇలాగే CBI అధికారులమంటూ ఓ గ్యాంగ్‌ ముతూట్‌ ఫినాన్స్‌ నుంచి 40 కేజీల బంగారం ఎత్తుకెళ్లింది.

స్పెషల్‌ 26

‘స్పెషల్‌ 26’ సినిమానే తమకు స్ఫూర్తినిచ్చిందని నిందితులు పోలీసులకు చెప్పారు.

మీరట్‌లోని ఓ స్కూల్‌ కుర్రాడు తన తోటి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి, అతడి తండ్రిని డబ్బులు అడిగాడు. ఆ తర్వాత ఆ బాలుడిని కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌లో ‘షూటవుట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా’ లోని వివేక్‌ ఒబెరాయ్‌ని చూసి అలా చేశానని బాలుడు చెప్పాడు.

‘షూటవుట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా’

ఖోస్లా గా గోస్లా ఓ కామెడీ సినిమా. కానీ ఈ సినిమా స్ఫూర్తితోనే దిల్లీలో ఓ గ్యాంగ్‌ ప్రభుత్వ ప్లాట్లను విక్రయించింది. పోలీసుల విచారణలో వారు ఈ కామెడీ సినిమా పేరు చెప్పగానే అవాక్కవడం పోలీసుల వంతయింది.

‘ఖోస్లా గా గోస్లా’

జాన్‌ అబ్రహం, అభిషేక్ బచ్చన్‌ ‘ధూమ్‌’ సినిమా స్ఫూర్తితో కేరళలో నలుగురు యువకులు బ్యాంక్‌ చోరీకి ప్లాన్‌ చేశారు. ఈ నలుగురు బైకర్స్‌ను పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు.

ధూమ్‌