తెలంగాణలో 100 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం...ఇవి తప్పక గుర్తించుకోండి
YouSay Short News App
రెండో విడత ‘కంటివెలుగు’ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణలోని
అన్ని జిల్లాల్లో జనవరి 19 నుంచి స్క్రీనింగ్ ప్రారంభమవుతుంది.
కోటిన్నర మందికి ‘ఐ స్క్రీనింగ్’ చేయడమే ‘కంటివెలుగు’ రెండో విడత లక్ష్యం. తద్వారా గిన్నిస్ బుక్ రికార్డును సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గిన్నిస్ రికార్డు లక్ష్యంగా
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16,556 ప్రదేశాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో శిబిరంలో 8 మంది సిబ్బంది పనిచేస్తారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో
శని, ఆది, సెలవు రోజులు మినహా 100 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు వెళ్లొచ్చు.
100రోజుల పాటు
18ఏళ్లు పైబడిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రత్యేకంగా 1500 బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
1500 బృందాలు
పరీక్షలు చేయించుకోవాలని భావించే వారు ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్సును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో కేంద్రంలో సగటున రోజుకి 120 మందికి పరీక్షలు చేయనున్నారు.
ఆధార్ తప్పనిసరి
పరీక్షా కేంద్రాల్లో అత్యవసర పంపిణీకి 55లక్షల కళ్లద్దాలు సిద్ధం చేశారు. వీటిని తెలంగాణలోనే తయారు చేయడం విశేషం.
మేడ్ ఇన్ తెలంగాణ
శిబిరాల్లోనే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తారు. ప్రిస్కిప్షన్ గ్లాసెస్ రావాలంటే కాస్త ఆలస్యమవుతుంది. శిబిరంలోని సిబ్బంది ఆన్‌లైన్‌లో సంబంధిత వివరాలు పొందుపర్చి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
శిబిరాల్లోనే రీడింగ్ గ్లాసెస్
ప్రిస్కిప్షన్ గ్లాసెస్‌ని గ్రామంలోని ఏఎన్‌ఎంకు పంపిస్తారు. ఏఎన్ఎం లబ్ధిదారులకు చేరవేస్తారు. ఆపరేషన్ అవసరమైన వారిని ఆసుపత్రికి సిఫార్సు చేస్తారు.
ANMల ద్వారా
2018లో తొలివిడత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది విజయవంతమైంది. మళ్లీ ఐదేళ్ల తర్వాత రెండో విడత నిర్వహిస్తున్నారు.
ఐదేళ్ల తర్వాత
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్.. ఈ కార్యక్రమాన్ని ఎంతో మెచ్చుకున్నారు. తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని వెల్లడించడం విశేషం.