దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చేరుకున్న 12 చిరుత పులులు.. వీటి ప్రత్యేకతలు తెలుసా?

YouSay Short News App

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌  నుంచి 12 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి.

ప్రత్యేక విమానం ద్వారా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వాయుసేన స్థావరానికి చేరాయి

చరిత్రాత్మకమైన ఈ చీతాల స్థలమార్పిడి రెండు బ్రిక్స్‌ దేశాల మధ్య సంబంధాలకు కొలమానంగా  భారత్-సౌతాఫ్రికా అభివర్ణించాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి 8 చిరుతపులులను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు తీసుకువచ్చారు.

తాజాగా 12 చిరుత పులుల రాకతో  మొత్తం 20 చిరుత పులులను ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు తీసుకువచ్చినట్లయింది

మొత్తం 12 చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు, ఏడు మగ చిరుతలు ఉన్నాయి

ఈ చిరుతలు గంటకు 100-120కి. మీ వేగంతో వేటాడగలగటం వీటి ప్రత్యేకత

చిరుతల ప్రత్యేకత

ఇవి 4 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. 35 కేజీల నుంచి 55 కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఆడ చిరుతల కంటే మగ చిరుతలు కాస్త ఎక్కువ బరువుంటాయి.

ఈ చిరుతలను తొలుత నెలరోజులపాటు క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో ఉంచుతారు

క్వారంటైన్ ముగిశాక వీటిని కూనో నేషనల్ పార్కులో ప్రవేశపెడతారు. కూనో నేషనల్ పార్క్ చిరుత పులులకు ఆవాసంగా ఉంది.

ప్రపంచంలోని 70 శాతానికి పైగా పులులకు కేంద్రంగా  భారత్‌ ఉంది

భారత భూభాగంలో తిరుగాడిన ఆసియా చిరుతపులులు 1940వ దశకం చివర్లో అంతరించిపోయాయి.

ప్రాజెక్ట్ చీతలో భాగంగా వీటి జనాభా  పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది

వేట, ఆవాస ప్రాంతాలు తరిగిపోవటం వల్ల దేశంలో ఆసియా చిరుతలు అంతరించిపోయాని నిపుణులు చెబుతున్నారు