REVIEW: ‘18 పేజేస్’ నిఖిల్, అనుపమది ప్రేమ కథేనా?

కార్తీకేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్. వీరిద్దరూ మరోసారి 18 పేజేస్ అనే ప్రేమకథను పరిచయం చేసే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.

సుకుమార్ కథను అందించడం, అతడి శిష్యుడి దర్శకత్వం, అల్లు అరవింద్ సమర్పణ ఎప్పటిలాగే అంచనాలు పెంచాయి. ఈ వారం విడుదలైన చిత్రాలతో పోటీ పడుతుందా? బాక్సాఫీస్‌ వద్ద నిలబడిందో లెేదో తెలుసుకోండి.

సోషల్ మీడియా కారణంగా ప్రేమలో విఫలమైన కుర్రాడు అనుకోకుండా ఓ యువతి రాసిన డైరీ చదువుతాడు. ఆమెను చూడకపోయినా వ్యక్తిత్వంతో  లవ్‌లో పడతాడు.

కథ

ఇక ఆమెను కలుసుకుందాం అనే సరికి యువతి గురించి ఓ వార్త షాక్‌కు గురిచేస్తుంది. అసలు ఆమెకు ఏం జరిగింది? హీరో ఏం చేశాడు ? ఇలాంటివి తెరపై చూడాల్సిందే.

సినిమా ప్రారంభంలో దర్శకుడు ప్రేమ కథను పరిచయం చేశాడు. అమ్మాయిని చూడకుండానే ప్రేమలో పడిపోతాడు. ఇలాంటి సినిమాలు ఉన్నా ఆ ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డారు. కామెడీ ట్రాక్స్‌తో చిత్రాన్ని సాఫీగా నెట్టుకొచ్చారు.

సాఫీగా సాగిపోయే

18 పేజేస్ ట్రైలర్, పాటలు చూస్తే కచ్చితంగా ప్రేమ కథ అనిపిస్తుంది. కానీ, ఇంటర్వెల్ వెళ్లే సరికి సినిమాను థ్రిల్లర్‌ జోనర్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు.

ప్రేమకథ అన్నారు?

తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేపి వదిలేశాడు. ప్రేమకథ అయినా చాలా ట్విస్టులు ఉన్నాయనే హీరో నిఖిల్ మాటలు గుర్తుకురాక తప్పదు.

హీరోయిన్‌కు ఏం అయిందనే వేటలో నిఖిల్ చేసే ప్రయత్నాలతో సెకాండాఫ్ ప్రారంభమై ప్రీ క్లైమాక్స్ వరకు పరుగులు తీస్తుంది. అన్ని సినిమాల్లోగానే లాజిక్ లేని సీన్లు కొన్ని కనిపిస్తాయి. మరికొన్ని సన్నివేశాలు ముందే ఊహిస్తారు.

కథనంలో వేగం

సుకుమార్ కథ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. ప్రేమకథకు థ్రిల్లర్‌ అంశాలను జోడిస్తూ కథనం నడిపించడం బాగుంది.

రచన, దర్శకత్వం

దర్శకుడు సూర్యప్రతాప్ కుమారి 21 ఎఫ్‌తో హిట్ అందుకొని కాస్త అనుభవం సాధించారనే చెప్పాలి. కథను నడిపించిన తీరు ఫర్వాలేదు.

సినిమాలో పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి.

సాంకేతిక నిపుణులు

నిఖిల్ సిద్ధార్థ్ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ నటన బాగుంది. మిగతావారు పరిధి మేరకు నటించారు.

ఎవరెలా చేశారు?

కథ కథనం థ్రిల్లింగ్ అంశాలు

రేటింగ్ : 3 / 5

ప్లస్

ఊహించే సీన్లు

మైనస్