కృష్ణ వంశీ తీసిన మరిన్ని క్లాసిక్ చిత్రాలివే

‘ఖడ్గం’ సినిమాకు 20 ఏళ్లు

YouSay Short News App

కృష్ణ వంశీ. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు.  బంధువుల మధ్య ఎమోషన్స్ ఎంత బలంగా చూపిస్తారో. ప్రేమ కథను కూడా అదేస్థాయిలో తెరకెక్కించగలిగే దర్శకుడు.

ఆయన తెరకెక్కించిన ఖడ్గం చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు . ఈ సందర్భంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్స్‌  ఏంటో చూద్దాం

దేశభక్తి గురించి ప్రస్తావన వస్తే గుర్తొచ్చే సినిమా ఇది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు టీవీల్లో ఈ బొమ్మ పడాల్సిందే. సినిమా వచ్చి నేటికి 20 ఏళ్లు. 5 నంది, 3 ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకుంది.

ఖడ్గం

జేడీ చక్రవర్తి, మహేశ్వరి నటించిన ఈ ప్రేమ కథా చిత్రంతో కృష్ణ వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మేఘాలలో తేలిపోమ్మనిది అనే పాటను కేవలం బైక్ పైనే చిత్రీకరించి ట్రెండ్ సెట్ చేశారు.

గులాబీ

కింగ్ నాగార్జున కెరీర్‌లోనే గుర్తుండిపోయే సినిమా నిన్నే పెళ్లాడతా. నాగ్, టబు మధ్య ప్రేమతో పాటు కుటుంబం, స్నేహం చుట్టూ తిరిగే కథ. ఈ సినిమాకు జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ కూడా వచ్చింది.

నిన్నే పెళ్లాడతా

బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి ప్రధాన పాత్రల్లో నక్సలిజం నేపథ్యంలో సాగే చిత్రం. పోలీసుగా ఉన్న బ్రహ్మాజి నక్సల్ గ్రూప్‌కి నాయకుడిగా ఎందుకు ఎదుగుతాడు. అప్పటి సమాజ పరిస్థితులను ప్రస్తావిస్తూ తెరకెక్కించారు.

సింధూరం

సినిమాకు జాతీయ అవార్డుతో పాటు అంతర్జాతీయ  ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఐదు నంది అవార్డులు గెలుచుకుంది. ‘అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్నే స్వతంత్య్రం అందామా’ అనే పాట ఇప్పటికీ సమాజాన్ని ప్రశ్నస్తోంది.

NRI మహిళ రాయలసీమలో క్రూరమైన ఇంటికి కోడలుగా వచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనేది చూపించారు. ఇందులో జగపతిబాబు, సౌందర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. 9 నంది అవార్డులు, తెలుగు బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి.

అంతఃపురం

మహేశ్ బాబు కెరీర్‌లో బ్లాక్ బస్టర్ కుటుంబ కథా చిత్రం. రెండు కుటుంబాల మధ్య గొడవలు, మహేశ్, సోనాలీ మధ్య లవ్ ట్రాక్ అద్భుతంగా తెరకెక్కించారు. ‘అలనాటి రామచంద్రుడు’ అనే పాట లేకుండా ఇప్పటికీ పెళ్లిళ్లు జరగవంటే అతిశయోక్తి కాదు.

మురారి

అన్న, చెల్లెలు సెంటిమెంట్ తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించారు. ఆడపిల్లల వేధింపుల గురించి ప్రస్తావించిన సినిమా హిట్ కొట్టింది. ఎన్టీఆర్ చేతి నిండా రాఖీలు కట్టుకునే సీన్ ఇప్పటికీ ఫేమస్.

రాఖీ

ప్రేమ, కుటుంబ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. కాజల్, నవదీప్, శివబాలాజీ, సింధూమీనన్, నాగబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 5 నంది అవార్డులు సాధించింది.

చందమామ

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.