2022లో తెలుగు సినిమా డిజాస్టర్లు

You Say Short News App

ఆర్‌ఆర్‌ఆర్, సీతారామం, కార్తికేయ-2, బింబిసార వంటి బాక్సాఫీస్‌ హిట్లు వచ్చిన 2022లో అంచనాలు తలకిందులై బొక్కబోర్లా పడ్డా సినిమాలూ ఉన్నాయి

ఈ ఏడాది మార్మోగిన పేరు ‘ఆచార్య’. రూ.140 కోట్లతో తీసిన సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించలేక రూ. 73.5 కోట్లతో నష్టాలను మూటగట్టుకుంది

ఆచార్య

ఆచార్య పాదఘట్టం నుంచి బయటపడేందుకు కొరటాలకు చాలా కాలమే పట్టేలా కనిపిస్తోంది. NTR30 పైనే కొరటాల ఆశలు పెట్టుకున్నాడు

భారీ అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడ్డ మరో సినిమా. పూరీ హీరోయిజం లేదు, కనెక్టింగ్‌ స్టోరీ లేదు. విజయ్‌ చాలా కష్టపడ్డా, బీభత్సమైన ప్రమోషన్లు చేసినా సినిమాకైన ఖర్చు(సుమారు రూ.125 కోట్లు)లో సగం కూడా రాలేదు.

లైగర్‌

లైగర్‌ దెబ్బకు విజయ్‌తో పూరీ అనౌన్స్ చేసిన తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘జనగనమణ’ మరోసారి అటకెక్కింది

సాహో తర్వాత మంచి క్లాసిక్‌ లవ్‌స్టోరీతో వస్తున్నాడంటూ ప్రభాస్‌ పేరిట వచ్చిన ఈ సినిమా కూడా ఫస్ట్‌ షో నుంచే వరస్ట్‌ టాక్‌ తెచ్చుకుంది. రూ.350 కోట్లతో తెరకెక్కిస్తే కనీసం రూ.150 కోట్లు కూడా రాలేదు.

రాధేశ్యామ్‌

ప్రభాస్‌ ఆదిపురుష్‌ టీజర్‌పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సలార్‌, ప్రాజెక్ట్‌ K సినిమాలపైనే ప్రభాస్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు

జనం మెచ్చినా అచ్చిరాని సినిమా ‘అంటే సుందరానికి’. నజ్రియా, నానీ క్యూట్‌ లవ్‌స్టోరీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది గానీ పైసలు రాలే.

అంటే సుందరానికి

నక్సలిజం నేపథ్యంలో లవ్‌స్టోరీని కలిపి వేణు ఊడుగుల తీసిన ఈ సినిమాకు కూడా మౌత్‌ టాక్‌ బాగానే వినిపించింది గానీ జనాన్ని థియేటర్లకు మాత్రం లాగలేకపోయింది

విరాట పర్వం

పక్కా కమర్షియల్‌, వారియర్‌, థ్యాంక్యూ, రామారావు ఆన్‌ డ్యూటీ, మాచర్ల నియోజకవర్గం, జిన్నా,ది ఘోస్ట్, ప్రిన్స్, ఇట్లు మారేడుమిల్లి వంటి సినిమాలు కనీసం తొలి వీకెండ్‌ దాకా కూడా థియేటర్లలో ఆడలేదు.

ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో

బాలయ్య, చిరు బాక్సాఫీస్‌ క్లాష్‌తో మొదలవుతున్న 2023లో సలార్‌, హరిహర వీరమల్లు, దసరా, SSMB 28 లాంటి సినిమాలు రాబోతున్నాయి. కొత్త సంవత్సరం ఎవరికి కలిసొస్తుందో మరి!