2022 బెస్ట్ ఓటీటీ చిత్రాలు

You Say Short News App

ఓటీటీ వేదికగా 2022 సంవత్సరంలో కొన్ని  మంచి చిత్రాలు విడుదలయ్యాయి. ఇదిగో వాటిపై  ఓ లుక్కేయండి.

అలియా భట్, షెఫాలీ షా, విజయ్‌ వర్మ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ చిత్రం. తల్లి, కుమార్తె కలిసి తాగుబోతు భర్తకు బుద్ధి చెప్పే నేపథ్యంలో సాగే కథ. డార్లింగ్స్‌ సినిమా ఇంటిల్లిపాది కూర్చొని హాయిగా చూడవచ్చు.

డార్లింగ్స్ - నెట్‌ఫ్లిక్స్‌

ప్రతీకారం తీర్చుకునే కథాంశంలో చిన్ని సినిమా రూపుదిద్దుకుంది. కీర్తి సురేశ్, సెల్వ రాఘవన్ నటించారు. కీర్తి సురేశ్ నటనకు గుర్తింపు వచ్చింది.

చిన్ని( సానీ కాయిదామ్ ) - అమెజాన్ ప్రైమ్

మోహన్‌ లాల్‌ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “The 12th Man”. 12 మంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకుంటారు. అదే రోజు వారిలో ఒకరు చనిపోతారు. చంపింది ఎవరనే కోణంలో కథ సాగుతుంది. సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

12th Man - హాట్‌ స్టార్‌

పోలీసు శిక్షణలో భాగంగా ఉండే ఇబ్బందులతో పాటు అక్కడ జరిగే అన్యాయాల గురించి సినిమాలో ప్రస్తావించారు. ఓ పోలీస్ శిక్షకుడి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. తమీజ్ దర్శకత్వం వహించిన చిత్రంలో విక్రమ్ ప్రభు హీరోగా చేశాడు.

పోలీసోడు (తానక్కరన్) - హాట్‌ స్టార్

మోనికా ఓ మై డార్లింగ్ చిత్రం నియో నాయర్ క్రైమ్ థ్రిల్లర్. తన ప్రేయసి తండ్రికి సంబంధించిన యూనికార్న్ గ్రూప్‌ సంస్థను శాసించాలని చేసిన రోబిటిక్ ప్రయత్నం. ఈ సినిమా క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకుంది.

మోనికా , ఓ మై డార్లింగ్ - నెట్‌ ఫ్లిక్స్‌

ఈ సంవత్సరం ఓటీటీలో విడుదలైన సూపర్ చిత్రాల్లో ఒకటి మహాన్. చియాన్ విక్రమ్, అతడి కుమారుడు ధృవ్‌ అదిరిపోయే నటన కట్టిపడేస్తుంది. గ్యాంగ్ స్టర్‌, పోలీసుల మధ్య వైరం సీటు అంచుల్లో కూర్చోబెడుతుంది.

మహాన్ - అమెజాన్ ప్రైమ్

మమ్ముట్టి హీరోగా వచ్చిన మళాయం సైకలాజికల్ డ్రామా పురు. కుమారుడిని అతిగా సంరక్షిస్తున్న కొడుకు తండ్రి సమస్యల్లో పడటం. కుమారుడే తండ్రిని చంపేందుకు ప్రణాళికలు రచిచండం వంటి ఆసక్తికర అంశాలున్నాయి.

పురు(Puzhu) -  సోను లివ్

క్రికెట్‌లోకి లేటు వయసులో ఆరంగేట్రం చేసిన ఓ క్రికెటర్ జీవిత కథ. 40 సంవత్సరాలకు ప్రవీణ్ తాంబే అనే ఆటగాడు క్రికెట్‌లోకి అడుగు పెట్టడానికి ఎదుర్కొన్న ఇబ్బందులను చూపించారు.

ఎవరీ ప్రవీణ్ తాంబే - హాట్ స్టార్

ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత ఓ వృద్ధుడు వంటలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తాడు. ఇందులో రిషి కపూర్ శర్మాజీగా నటించారు. కానీ, అతడి జీవితం ఎన్నో మలుపులు తీసుకుంటుంది. ఓటీటీ వేదికగా వచ్చిన మరో మంచి సినిమా.

శర్మాజీ నమ్‌కీన్‌ -  అమెజాన్ ప్రైమ్

అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఓ నిర్లక్షరాస్యుడు అతడి చర్యల కారణంగా జైలుకు వెళ్తాడు. చదువు ఎంత అవసరమో గుర్తించి జైలులో ఉన్నప్పుడే 10వ తరగతి పూర్తి చేస్తాడు. సినిమా అందరినీ మెప్పిస్తుంది.

దస్వీ  - హాట్‌ స్టార్‌