2022: ప్రపంచంలోని టాప్ వంటకాల్లో హైదరాబాద్ బిర్యాని
YouSay Short News App
ప్రపంచంలో అత్యంత రుచికరమైన, సంప్రదాయ డిషెస్‌లలో భారత్‌కు చెందిన ఐదు వంటకాలు టాప్ 100లో స్థానం సంపాదించాయి. వీటిలో మన హైదరాబాద్‌కి చెందిన దమ్ బిర్యాని కూడా ఉండటం విశేషం.
టేస్ట్‌అట్లాస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భోజనప్రియుల అభిప్రాయాన్ని సేకరించి.. ఆయా డిష్‌లకు రేటింగ్ ఇచ్చింది. ఇందులో జపాన్‌కి చెందిన కరే అనే శాకం(కర్రీ)కు ఎక్కువ మంది మొగ్గు చూపడంతో.. తొలి స్థానంలో నిలిచింది.
బ్రెజిల్‌కు చెందిన పికన్హా, పోర్చుగల్‌కి చెందిన బుల్హానో పాటో, చైనాకు చెందిన టాంగ్‌బవో, గువాటీ వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ నుంచి షాహీ పనీర్, బటర్ చికెన్, కుర్మా, వండీరా టాప్100లో చోటు దక్కించుకున్నాయి.
పంజాబ్‌లో ఈ డిష్ చాలా ఫేమస్. నాన్స్, రోటీ, పూరీల్లో నంచుకోవడానికి షాహీ పనీర్‌ని వాడుతుంటారు. ప్రపంచంలో 28వ రుచికరమైన, సంప్రదాయమైన డిష్‌గా ఇది నిలిచింది. దీనినే రాయల్ పనీర్ అని కూడా పిలుస్తుంటారు. శాకాహారులకు ఇది ప్రీతిపాత్రమైంది.
షాహీ పనీర్
ఇండియాలో ఎక్కడికెళ్లినా కనిపించే మరో డిష్.. బటర్ చికెన్. 1950లో దిల్లీలో తొలిసారిగా దీనిని వండినట్లు చరిత్ర చెబుతోంది. ఎంతో రుచికరంగా ఉంటుంది గనుక ప్రపంచవ్యాప్తంగా ఇది 53వ స్థానం దక్కించుకుంది.
బటర్ చికెన్
కుర్మాలో వెజ్, నాన్‌వెజ్ రకాలుంటాయి. క్రీ.శ.1500లోనే పార్షియన్, ఇండియన్ డిష్‌గా ఇది పేరొందింది. ఉత్తర, దక్షిణ భారతంలో దీనిని విరివిగా తయారు చేస్తుంటారు. అనాది నుంచి వస్తున్న ఈ వంటకం.. 55వ స్థానంలో నిలిచింది.
కుర్మా
వాస్తవానికి ‘విండాలో’ ఇంగ్లాండులో ప్రముఖ వంటకం. బ్రిటీష్ మూలాలు గోవా, కొంకణ్‌లకు పాకడంతో ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది. సాధారణంగా దీనిని పంది మాంసంతో తయారు చేస్తారు. ఎద్దు, గొర్రె, మేక లేదా పనీర్ ద్వారానూ దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వంటకం 71వ ర్యాంకుని సంపాదించుకుంది.
విండాలో
ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యాని సంప్రదాయ వంటకాల్లో టాప్ 100లో నిలిచింది. దీని తయారీ విధానమే మిగతా బిర్యానిలను వెనక్కి నెట్టేలా చేసింది. దమ్ బిర్యానికి ప్రత్యేకంగా ఓటు వేయడంతో 79వ ర్యాంకుని సాధించింది. చికెన్, మటన్ బిర్యానిలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
హైదరాబాద్ బిర్యాని
ప్రపంచవ్యాప్తంగా రుచికరమైన వంటకాల్లో తొలి ర్యాంకు సాధించిన కరె వంటకం జపాన్‌కి చెందినది. ఇది ఒక శాకం లాంటిది. భారతీయ కర్రీలతో పోలిస్తే.. ఇది కాస్త తక్కువ కారంగా ఉంటుంది. రైస్, న్యూడిల్స్, పాస్త్రీ వంటివాటితో కలిపి దీనిని వాడొచ్చు.
క్యూసిన్స్‌లలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. పదార్థాలు, వంటకాలు, శీతల పానీయాల లభ్యత ఆధారంగా ఈ సర్వేను టేస్ట్ అట్లాస్ రూపొందించింది. ఇక తొలి స్థానంలో ఇటాలియన్ వంటకాలు నిలిచాయి.
క్యూసిన్స్‌లో టాప్ 5
బటర్ నాన్, పావ్ బాజీ, కిచిడీ, బిర్యాని, పాలక్ పనీర్, మలయ్ కోఫ్తా, ఉప్మా, చట్నీ, మసాలా దోస, ఇడ్లీ వంటివి దేశవ్యాప్తంగా పేరొందాయి. వీటి రుచిని ఆస్వాదించేందుకు భోజన ప్రియులు ఇష్టపడుతున్నారట.
ఈ సర్వేపై నెటిజన్లు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలను కాకుండా వేరే వాటిని జాబితాలో చేర్చారని పలువురు ఆరోపిస్తుండటం గమనార్హం.