2022 Round Up : టాలీవుడ్‌లో టాప్- 5 సంగీత దర్శకులు వీరే!
YouSay Short News App
సినిమాకు సంగీతం ఎంతో ప్రధానం. చిత్రం విజయం సాధించడంలో మ్యూజిక్‌ది కీలక పాత్ర. అలా మన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన సినిమాలు చాలానే వచ్చాయి.
ఇక ఈ ఏడాదిలో ఉత్తమ సంగీతం అందించి.. ప్రేక్షకుల హృదయాల్ని కదిలించిన సంగీత దర్శకులెవరో ఓ సారి చూద్దామా..!
టాలీవుడ్‌లో 2022లో దుమ్ములేపిన సంగీత దర్శకుల్లో ఎస్ఎస్ తమన్ ముందుంటాడు.
ఏ పాటకు బాణీ కట్టినా అది హిట్టే అయింది.
తమన్
అటు మాస్, ఇటు క్లాస్ ట్యూన్లు కట్టి సంగీత ప్రియులతో స్టెప్పులేయించాడు. రాధేశ్యామ్, సర్కారు వారి పాట, థాంక్యూ, గాడ్ ఫాదర్, ప్రిన్స్, గని, వరిసు వంటి చిత్రాలకు తమన్ స్వరాలు సమకూర్చాడు.
సర్కారు వారి పాట సినిమాలోని ‘కళావతి’ సాంగ్ బాగా పాపులర్ అయింది. తమన్ పాటల్లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షణలు దక్కింది కళావతికే. యూట్యూబ్‌లో ఏకంగా 300 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ జనరేషన్ సంగీత దర్శకులతో పోటీపడి మ్యూజిక్ చేస్తున్న లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్.. ఎం.ఎం.కీరవాణి. పాటలు, నేపథ్య సంగీతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
ఎం.ఎం.కీరవాణి
క్రిటిక్స్ అవార్డు కూడా ఈ సినిమా మ్యూజిక్‌కి దక్కింది. జయమ్మ పంచాయతీ, బింబిసార సినిమాలకూ సంగీతం అందించాడు కీరవాణి.
ఆర్ఆర్ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట యూట్యూబ్‌లో 300మిలియన్లకు పైగా వ్యూస్‌ని దక్కించుకుంది. ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డు రేసులోనూ నిలవడం విశేషం.
రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘పుష్ప’ సినిమాలోని పాటలు ఎంతో హిట్టయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా ఆలకించిన టాప్ 10 పాటల్లో 4 పాటలు ఈ సినిమా నుంచే ఉండటం విశేషం.
దేవీ శ్రీ ప్రసాద్
ఈ ఏడాది డీఎస్పీకి చెప్పుకోదగ్గ ఆల్బమ్‌లు లేవు.
8 సినిమాలకు సంగీతం అందించాడు. రౌడీబాయ్స్, గుడ్ లక్ సఖీ, ఖిలాడీ, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఎఫ్3, వారియర్, రంగరంగ వైభవంగా, దృశ్యం2(హిందీ), వాల్తేరు వీరయ్య.
డీఎస్పీ అందించిన పాటల్లో.. వారియర్ సినిమాలోని ‘బులెట్’ సాంగ్ మంచి గుర్తింపు పొందింది. యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘కొమురం భీముడో’ పాట పాడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కాళభైరవ. తండ్రి కీరవాణి వారసత్వాన్ని కొనసాగిస్తూ నేటితరం మ్యూజిక్ డైరెక్టర్లతో పోటీ పడుతున్నాడు. కార్తికేయ2 సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు.
కాళభైరవ
కార్తికేయ2తో పాటు బ్లడీ మేరీ, హ్యాపీ బర్త్‌డే, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం సినిమాలకు సంగీతం అందించాడు.
కార్తికేయ2తో పాటు బ్లడీ మేరీ, హ్యాపీ బర్త్‌డే, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం సినిమాలకు సంగీతం అందించాడు.కార్తికేయ2 సినిమాలోని కృష్ణ తత్వం పాట ఈ ఏడాది బాగా పాపులర్ అయింది.
మెలోడీ బ్రహ్మా మణిశర్మ మరోసారి తన సంగీతంతో మ్యాజిక్ చేశాడు. ఆచార్య, యశోద సినిమాలకు మంచి సంగీతం అందించి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.
మణిశర్మ
మణిశర్మ స్వరాలు సమకూర్చిన ‘భలే భలే బంజారా’ పాట ఎక్కువమందిని ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో దీనికి 45మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
శ్రీచరణ్ పాకాల
సినిమాలు : డీజే టిల్లు, మేజర్, ఇట్లు మారేడిమిల్లు ప్రజానీకం
వివేక్ సాగర్
సినిమాలు : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అంటే సుందరానికీ