2023 వార్షిక రాశిఫలాలు

ఆ మూడు రాశులకు ఈ ఏడాది తిరుగు లేదు!

YouSay Short News App

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. గతేడాది అనుభవాలు గుర్తుండే ఉంటాయి. కనీసం 2023 అయినా బాగుండాలని చాలామందే కోరుకుంటాం.

ఈ సంవత్సరం కలిసి వస్తుందా? ఏం ఇబ్బందులున్నాయి? అనుకూలతలేంటి ? ఇలా ఎన్నింటినో రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. మరి ఏ రాశివారికి ఎలా  ఉందో తెలుసుకుందామా?

ఈ ఏడాది మేష రాశి వారు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు సానుకూలం. ఎవరితోనూ వివాదాలకు దిగొద్దు.

వృషభ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం, ధనలాభం, పేరు ప్రతిష్ఠలు, ప్రమోషన్లు వంటివి ఉంటాయి. అప్పుడప్పుడు అనారోగ్యాలు ఉండవచ్చు. ఆరోగ్యంపై దృష్టిపెట్టండి.  ఆదాయం పెరుగుతుందని తెలుస్తోంది. రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. మెుక్కులు ఏమైనా ఉంటే తీర్చుకోండి.

ఈ రాశి వారు సంవత్సరం పాటు కాస్త ప్రశాంతంగా గడుపుతారు. తలపెట్టిన లక్ష్యాలు ఆలస్యం అయినా కొన్ని నెరవేరుతాయి. ఆస్తుల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పనిలో పై అధికారుల నుంచి విమర్శలుంటాయి.సైన్స్‌, ఐటీ విద్యార్థులు రాణించవచ్చు.

ఇంటా బయట శ్రమ, ఒత్తిడి. ఏప్రిల్‌ తర్వాత ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. ఈ ఏడాది బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు రెట్టింపు. డబ్బు నష్టపోతారు. ఆశించిన పనులు దాదాపు పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. వ్యాపార, ఆర్థిక రంగాల్లో పురోగతి ఉంటుంది.

ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం, ఆదాయం పెరుగుదల లాభించవచ్చు. వివాహ ప్రయత్నాలు  అనుకూలిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఏప్రిల్ వరకు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంటే మంచిది.

ఉద్యోగాల్లో స్థిరత్వం, కొత్త ఉద్యోగాలు, ఇళ్లు అమ్మడం, ఆస్తులకు సంబంధించి కేసుల నుంచి బయటపడటం వంటివి ఉండవచ్చు. ఆదాయానికి కొరత ఉండదు. ఆరోగ్యపరంగానూ సానుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలం. తీర్ధయాత్రలు చేయడం మంచిది.

ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ప్రతిపని ఆలస్యం, అవసరపు ఖర్చులు, ప్రయాణాలు, ఇరుగుపొరుగు సమస్యలు వేధించవచ్చు. కానీ, ఏడాది ప్రశాంతంగా గడిచిపోతుంది. కొత్త ఆదాయమార్గాలు అన్వేశిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నవారికి అనుకూలం.

ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. ఆదాయం, ఆరోగ్యపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. శ్రమమీద పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. రియల్‌ ఎస్టేట్, బ్యాంకర్లకు ఆశించిన సమయం.

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనవసర ఖర్చులు వేధించవచ్చు. మానసిక ఒత్తిడి ఉంటుందట. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. భార్యలతో గొడవలు పెట్టుకోవటం మంచిది కాదు. ఇల్లు కొనుగోలు అవకాశాలు ఉన్నాయి.

ప్రతికూల ఫలితాలు ఉన్నాయి.ఇళ్లు, స్థలం అమ్ముకోవాల్సి వస్తుంది. వైద్యానికి ఖర్చు చేయాలి. అనవసరపు ఖర్చులు, బ్యాంక్‌ బ్యాలెన్స్ తగ్గటం. విద్యార్థులు శ్రమపడక తప్పదు. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.

జనవరి 18 తర్వాత ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. అప్పులు రికవరీ అవుతాయి. అవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.