పూజలు, టపాసులతో పాటు స్పెషల్ 

 దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్వీట్ ప్రసిద్ధి. అవేంటో చూద్దాం.

కూడా దీపావళిలో భాగం.

స్వీట్స్ 

బియ్యం పిండి, బెల్లం, నూనెతో తయారయ్యే ‘అరిసెలు’ ఏపీలో ఎంతో ప్రత్యేకం. అక్కడివారు వాటిని ఎంతో ప్రీతిపాత్రంగా తింటారు.

ఆంధ్రప్రదేశ్

కొబ్బరి తురుము, చక్కెరతో కలిపి చేసే ‘నరికోల్ లడ్డూ’ ఇక్కడ ఫేమస్.

అసోం

వేయించిన పిండి, చక్కెర పాకంతో చేసే ‘మడత కాజా’ ఇక్కడ ప్రసిద్ధి. ఈ స్వీట్ భారతదేశం అంతటా దొరుకుతుంది.

బీహార్

గోవాలో ‘బేబినికా’ కేక్ దీపావళికి ప్రత్యేక వంటకం. ఇది గోవాలో తప్ప భారత్‌లో ఇంకెక్కడా కనిపించదు. ఇది ఇండో-పోర్చుగీస్ వంటకం

గోవా

చిక్కటి పెరుగు, చక్కెర కలిపి చేసే‘ శ్రీఖండ్’ స్వీట్‌ను గుజరాతీయులు ఇష్టంగా తింటారు. ఇది గుజరాత్ సంప్రదాయం వంటకం కూడా.

గుజరాత్

చక్కెర, డ్రైఫ్రూట్స్‌తో చేసే ‘నోలెన్ గురెర్ పాయసం’ ఇక్కడ దీపావళి ప్రత్యేక వంటకం. ఈ స్వీట్‌ను బెంగాళీలు అత్యంత రుచిగా తయారుచేసుకుంటారు.

పశ్చిమబెంగాల్

మైదాపిండి, చక్కెర లేదా బెల్లంతో తయారుచేసే ‘బాదుషా’ స్వీట్ ఉత్తరప్రదేశ్‌లో సంప్రదాయ వంటకం. దీనిని ఇండియన్ డోనట్‌గా పిలుస్తారు.

ఉత్తరప్రదేశ్

శనగపిండి, చక్కెర, నెయ్యి, యాలకుల మిశ్రమంతో కలిపి చేసే ‘మైసూర్ పాక్’ కర్నాటకలో ఫేమస్ స్వీట్. ఇది సౌతిండియాలోని అన్ని రాష్ట్రాల్లో దొరుకుతుంది.

కర్నాటక

రైస్ నూడిల్స్‌ను ఆవిరితో ఉడికించి తయారు చేసే ‘ఇళయప్పం’ ఇక్కడి వారికి ప్రత్యేక దీపావళి వంటకం.

కేరళ

మైదాపిండి, కోవా, డ్రైఫ్రూట్స్, నెయ్యి మిశ్రమాలతో చేసే ‘గుజియా’ స్వీట్ మధ్యప్రదేశ్‌లో ఎంతో ప్రసిద్ధి. ‘గుజియా’ స్వీట్‌ను తెలుగు రాష్ట్రాల్లో ‘కజ్జికాయ’గా పిలుస్తారు.

మధ్యప్రదేశ్

దీపావళికి మరాఠీలు ‘మోదక్’ స్వీట్‌ను తయారు చేసుకుని ఇష్టంగా తింటారు.

మహరాష్ట్ర

ఆయుర్వేద మూలికలతో తయారుచేసే ‘మురుండు’ స్వీట్‌ను తమిళులు దీపావళికి ఇష్టంగా తింటారు. దీనిని ‘ఆయర్వేదిక్ డిజర్ట్’ అని కూడా పిలుస్తారు.

తమిళనాడు

రాజస్తాన్‌లో దివాళికి ‘మావ’ స్వీట్‌ను తయారుచేసుకుంటారు. ఇది మొత్తం డ్రైఫ్రూట్స్‌తో నిండి ఉంటుంది.

రాజస్తాన్

బ్లాక్ రైస్, చక్కెర పదార్థాలతో తయారుచేసే ‘చకావు’ స్వీట్ అంటే మణిపూర్ ప్రజలకు ప్రీతిపాత్రం.

మణిపూర్

గోధుమపిండి, సోంపుగింజలు, చక్కెర, నెయ్యిలతో తయారయ్యే ‘పోడా’  స్వీట్ సర్దార్లకు అత్యంత ఇష్టమైన స్వీట్. ఇది పాన్ కేక్ లాగే ఉంటుంది.

పంజాబ్

గోధుమపిండి, నట్స్, చక్కెర, నెయ్యితో తయారు చేసే ‘గోండ్ కే లడ్డూ’ హరియాణా ప్రజలు ఎక్కువగా తింటారు.

హరియాణా

డార్క్ చాక్లెట్, గసగసాలు, చక్కెర పదార్థాలతో తయారు చేసే ‘బాల్ మిఠాయి’ ఇక్కడి ప్రత్యేక వంటకం. దివాళికి ఇది అందరి ఇళ్లలోనూ తయారు చేసుకుంటారు.

ఉత్తరాఖండ్

స్వీట్ రైస్ బ్రెడ్‌తో తయారు చేసే ‘సాయిల్ రోటీ’ స్వీట్‌ను అస్సామీయులు దివాళి రోజున తప్పక రుచి చూస్తారు. ఇది సహజంగా నేపాలీ వంటకం.

సిక్కిం.

గోధుమపిండి, నల్ల పప్పు, నూనె మిశ్రమాలతో చేసే ‘బబ్రూ’ స్వీట్ ఇక్కడ ప్రసిద్ధి. ఇది పూరి లాగే ఉంటుంది.

హిమాచల్ ప్రదేశ్

వివిధ రకాల డ్రైఫ్రూట్స్, చక్కెర పాకంతో తయారు చేసే ‘సుఫ్తా’ స్వీట్ కశ్మీరీల ఫేవరెట్ డిష్.

జమ్ముకశ్మీర్

గోధుమపిండి, నువ్వులు, చక్కెర, నెయ్యి మిశ్రమాలతో తయారుచేసే ‘ఖుర్మీ’ స్వీట్‌ను ఇక్కడివారు లొట్టలేసుకుంటూ తింటారు.

జార్ఖండ్

బ్లాక్ రైస్‌తో తయారుచేసే ‘నాప్ నాంగ్’ స్వీట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని నాగాలాండ్ ప్రజలు ఎంతగానో ఆస్వాదిస్తారు.

నాగాలాండ్

మైదాపిండి, పాలు, నెయ్యి మిశ్రమాలతో ‘ఖాప్సా’ స్వీట్ తయారు చేస్తారు. ఇది ఇక్కడి వారికి ప్రత్యేక వంటకం.

అరుణాచల్ ప్రదేశ్

బియ్యంపిండి, బెల్లం, నూనె ఉపయోగించి ‘పుఖ్లీన్’ తయారు చేస్తారు. ఇవి చూడటానికి అరిసెలు లాగే ఉంటాయి.

మేఘాలయా

బియ్యం పిండి, పెరుగు, నూనె, చక్కెర పాకంతో ‘డెరోరీ’ స్వీట్ తయారు చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

చత్తీస్‌గఢ్

గోధుమపిండి, మైదాపిండి, రవ్వ, నువ్వులతో ‘గర్జాలు’ తయారు చేస్తారు. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందాయి.

తెలంగాణ

లైరు అనే ఒక ఆకును ఉపయోగించి ‘అవాన్ బంగ్వీ’ వంటకం తయారు చేస్తారు. ప్లైన్, పోర్క్, బీఫ్ బంగ్వీలు కూడా ఇక్కడ తయారు చేస్తారు.

త్రిపుర

పాలు, చక్కెర పదార్ధాలతో ‘సందేష్’ స్వీట్ చేస్తారు. ఇది ఉత్తర భారతంలో ఫేమస్ స్వీట్

ఒడిషా

ఇవేకాక గులాబ్ జామ్, సోన్ పాపిడి, హల్వా, తదితర స్వీట్లు భారతదేశమంతటా లభిస్తాయి.